ప్రకాశం: కనిగిరిలోని మున్సిపల్ కార్యాలయం వద్ద ఎస్సై మాధవరావు వాహనదారులకు రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. హెల్మెట్ వాడకంతో కలిగే ఉపయోగాలను వివరించారు. ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని సూచించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వద్దని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు.