AP: టార్గెట్ తిరుమల అన్నట్లుగా YCP నేతలు వ్యవహరిస్తున్నారని టీటీడీ పాలకమండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి అన్నారు. గోశాల నుంచి గోవిందుడి వరకు అన్నీ దుష్ప్రచారాలే చేస్తున్నారని మండిపడ్డారు. ఉద్దేశపూర్వకంగా టీటీడీ పవిత్రను దెబ్బతీసేలా భూమన వ్యవహారిస్తున్నారని ఆరోపించారు. తిరుమల పవిత్రతను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.