HYD: ఎక్సైజ్ గెజిటెడ్ అధికారుల సంఘం నూతన క్యాలెండర్ను మంత్రి జూపల్లి కృష్ణారావు రవీంద్ర భారతిలోని తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఆయన ఎక్సైజ్ శాఖలో ఏ విధమైన సమస్యలున్న ప్రభుత్వం సత్వరమే పరిష్కరించి శాఖ అభివృద్ధికి తోడ్పడుతుందని హామీ ఇస్తూ అధికారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గెజిటెడ్ అధికారుల సంఘ అధ్యక్ష కార్యదర్శులు, సభ్యులు పాల్గొన్నారు.