GDWL: గర్భిణులు, బాలింతల భద్రతకు ‘102’ అమ్మ ఒడి వాహన సేవలు ఎంతో ఉపయోగపడుతున్నాయని జిల్లా మేనేజర్ రత్నమయ్య తెలిపారు. బుధవారం అయిజ మండలంలోని పలు గ్రామాల గర్భిణులను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించి, అనంతరం క్షేమంగా ఇళ్లకు చేర్చారు. తల్లి, బిడ్డల ఆరోగ్య రక్షణ కోసం సిబ్బంది నిరంతరం సేవలందిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.