»Pregnancy Ladies Should Take Care Of These Things
Pregnancy: గర్భిణీ స్త్రీలు కచ్చితంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..!
గర్భధారణ చాలా సున్నితమైనది. చిన్న పొరపాటు జరిగినా.. కడుపులోని బిడ్డపై తీవ్ర దుష్ప్రభావం పడుతుంది. ప్రెగ్నెన్సీ సమయంలో పరిశుభ్రతపైనా శ్రద్ధ వహించాలని నిపుణులు అంటున్నారు. గర్భిణులు శుభ్రతై ఏమాత్రం నిర్లక్ష్యం చేసి.. తీవ్రమైన ఇన్ఫెక్షన్లు దాడి చేసే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. ఇవి తల్లి, బిడ్డ శ్రేయస్సుపై ప్రభావం చూపుతాయి.
అనారోగ్యాల నివారణ:
రుబెల్లా, చికెన్‌పాక్స్, ఫ్లూ వంటి అనారోగ్యాలు గర్భిణీలకు, పుట్టబోయే బిడ్డకు హాని కలిగిస్తాయి.
అనారోగ్యంతో ఉన్న వ్యక్తులకు దూరంగా ఉండండి.
తరచుగా చేతులను శుభ్రం చేసుకోండి.
అనారోగ్యంతో ఉంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించండి.
పరిశుభ్రత:
భోజనం చేసే ముందు, దగ్గినా, తుమ్మినా, మలవిసర్జన తర్వాత చేతులను శుభ్రం చేసుకోండి.
చేతుల పరిశుభ్రత వల్ల కలరా, కరోనా, షిగెలోసిస్, సార్స్, హెపటైటిస్-ఇ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి.
చేతులతో ముఖాన్ని తాకవద్దు.
నీరు:
తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉండటానికి హైడ్రేట్‌గా ఉండటం చాలా ముఖ్యం.
రోజుకు కనీసం ఎనిమిది గ్లాసుల నీరు తాగండి.
కెఫిన్, ఆల్కహాల్, చక్కెర పానీయాలకు దూరంగా ఉండండి.
నోటి ఆరోగ్యం:
రోజుకు రెండుసార్లు ఫ్లోరైడ్ టూత్‌పేస్ట్‌తో బ్రష్ చేయండి.
నోటి పరీక్షలకు క్రమం తప్పకుండా వెళ్లండి.
గమనిక:
ఈ చిట్కాలు సాధారణ సమాచారం కోసం మాత్రమే.
ఏవైనా సందేహాలు ఉంటే వైద్యుడిని సంప్రదించండి.