AP: తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) భక్తులకు శుభవార్త చెప్పింది. టీటీడీ ఆధ్వర్యంలోని స్థానిక ఆలయాల్లో ఇకపై ప్రతిరోజూ రెండు పూటలా అన్న ప్రసాద వితరణ చేయాలని నిర్ణయించింది. ఈ నూతన విధానాన్ని మార్చి నెలాఖరు నుంచి అమలు చేయనున్నారు. ఇప్పటివరకు మధ్యాహ్నం మాత్రమే అన్నప్రసాదం అందిస్తుండగా, ఇకపై రాత్రి వేళ కూడా భక్తులకు భోజనం వడ్డించనున్నారు.