»The Situation Of Women In Sudan Is Miserable Forced Sex With Soldiers For Food
Sudan: ఆహారం కావాలంటే సైనికుల కోరిక తీర్చాల్సిందే.. సూడన్ మహిళల దయనీయ స్థితి
యుద్దం కారణంగా చితికిపోయిన సూడన్ దేశంలో మహిళల పరిస్థితి దారుణంగా మారింది. ఆహారం కావాలంటే ఆ దేశపు సైనికులతో బలవంతంగా శృంగారానికి ఒప్పుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ మేరకు అంతర్జాతీయ పత్రిక ఈ విషయాన్ని వెల్లడించింది.
The situation of women in Sudan is miserable.. Forced sex with soldiers for food
Sudan: యుద్దం కారణంగా చితికిపోయిన సూడన్ దేశంలో మహిళల పరిస్థితి దారుణంగా మారింది. ఆహారం కావాలంటే ఆ దేశపు సైనికులతో బలవంతంగా శృంగారానికి ఒప్పుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ మేరకు అంతర్జాతీయ పత్రిక ఈ విషయాన్ని వెల్లడించింది. సూడాన్‌లో మహిళలు ఆహారం కోసం సైనికుల కోరికలు తీరుస్తున్నట్లు గార్డియన్ అనే పత్రిక వెల్లడించింది. తమ కుటుంబానికి ఆహారం అందించాలి అన్నా, లేదా వంటకు కావాల్సిన సరకులు కావాలన్నా సైనికుల కామవాంఛలను తీర్చడం తప్ప మరో మార్గం లేదని ఒండుర్మన్ నగరం నుంచి పారిపోయి వచ్చిన మహిళలు వాపోయారు. ఆ నగరం నుంచి దాదాపు పాతిక మంది పారిపోయి వచ్చినట్లు పత్రిక పేర్కొంది.
నిత్యవసర వస్తువులు, ఆహారం నిల్వలు ఉన్న అన్ని కర్మాగారాల్లో ఈ రకమైన పరిస్థితినే మహిళలు ఎదుర్కొంటున్నట్లు పత్రిక తెలిపింది. ఒండుర్మన్ నగరంలోని ప్రజలు ఆహార కోసం పడిగాపులు గాస్తున్నారు. దీన్ని ఆసరాగా తీసుకున్న సైనికులు దుశ్చర్యలకు పాలుపడుతున్నట్లు మహిళలు తెలిపారని పత్రిక పేర్కొంది. ఈ మేరకు ఒక మహిళ డైరెక్ట్ స్టేట్ మెంట్‌ను పత్రిక ప్రస్థావించింది. ‘వృద్ధులైన నా తల్లిదండ్రులు అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆ సమయంలో ఆహారంకోసం నా కుమార్తెను బయటికి పంపడానికి మనస్కరించలేదు. అందుకనే నేనే వెళ్లి సైనికుల కోరిక తీర్చి బదులు ఆహారాన్ని తీసుకొచ్చాను’ అంటూ ఓ మహిళ కన్నీటిపర్యంతమైనట్టు గార్డియన్ పత్రికలో పేర్కొంది.