»Encounter In Jammu Four Soldiers Including An Army Officer Martyred
Encounter: జమ్మూలో ఎన్కౌంటర్… ఉగ్రదాడిలో ఐదుగురు జవాన్లు మృతి
జమ్మూ-కశ్మీర్లో భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. ఈ దాడిలో ఒక ఆర్మీ అధికారితో సహా నలుగురు జవాన్లు మృతి చెందారు. సోమావారం రాత్రి జరిగిన ఈ దాడిలో పోలీసులు కూడా తీవ్రంగా గాయపడ్డారు.
Encounter in Jammu.. Four soldiers including an army officer martyred
Encounter: జమ్మూ-కశ్మీర్‌లోని దోడాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఉగ్రవాదులకు, భద్రతాబలగాలకు ఎదురుకాల్పులు జరిగాయి. ఈ దాడిలో ఒక ఆర్మీ ఆఫీసర్‌తో సహా నలుగురు జవాన్లు వీరమరణం పొందారు. డోడా జిల్లాలని దెస్సా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో ఇండియన్ ఆర్మీ, స్థానిక పోలీసులు సోమవారం రాత్రి 7.45 గంటలకు సమయంలో సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టాయి. టెర్రరిస్టులు అక్కడే నక్కి కాల్పులు ప్రారంభిచారు. దాంతో భద్రతాసిబ్బంది కాల్పులు జరిపింది. వీరిద్దరి మధ్య జరిగిన ఎదరుకాల్పుల్లో నలుగురు ఆర్మీ సిబ్బందితోపాటు పోలీసులు గాయపడ్డారు. వీరిని ఆసుపత్రికి తరలిస్తుండగా ఒక ఆర్మీ అధికారితో పాటు నలుగురు జవాన్లు మరణించినట్లు అధికారులు తెలిపారు.
సోమవారం రాత్రి 9 గంటలకు దెస్సా ప్రాంతంలో ఎన్కౌంటర్ ప్రారంభమైందని, ఇరు వర్గాల మధ్య భారీ కాల్పులు జరిగాయని ఇండియన్ ఆర్మీ ఎక్స్ వేదికగా వెల్లడించింది. మొత్తం 20 నిమిషాలకుపైగా కాల్పులు జరిగాయని తెలిపింది. ఆపరేషన్ ఇంకా కొనసాగుతుందని, గాయపడిన వారిలో పోలీసుల పరిస్థితి కూడా విషమంగా ఉందని పేర్కొంది. ఈ దాడికి పాల్పడింది పాకిస్థాన్ ఉగ్రసంస్థ జైషే మహమ్మద్‌కు చెందింది అన్న విషయాన్ని కశ్మీర్ టైగర్ ప్రకటించింది. ఈ వారం రోజుల్లో జమ్మూ రిజీయనల్లో ఇది రెండో ఎన్కౌంటర్. గతవారం కతువాలో జరిగిన దాడిలో ఐదుగురు జవాన్లు మరణించారు. మరో ఐదుగురు జావాన్లు గాయపడ్డారు. ఆర్మీ వాహనాలపై టెర్రరిస్టులు ఒక్కసారిగా విరుచుకుపడ్డ విషయం తెలిసిందే.