VZM: మెంటాడ మండలం చాకివలనస నుంచి జయతి గ్రామానికి చెందిన 26 కుటుంబాల వలస కూలీలకు 70 రోజులు పని కల్పించామని స్దానిక MPDO సుదర్శన్ ఆదివారం తెలిపారు. మిగతా 30 రోజుల పని కల్పిస్తామన్నారు. ఈ సందర్భంగా క్షేత్ర సహాయకులకు, APO లకు, టెక్నికల్ అసిస్టెంట్లకు ఆదేశాలు జారీ చేశారు. వలసలు వెళ్లకుండా ఉపాధి పనులు పెట్టి ఆదుకోవాలని ఆయన సూచించారు.