లింగ మార్పిడి చేయించుకున్న తన కుమారుడిపై ఎలాన్ మస్క్ తాజాగా స్పందించారు. ఓక్మైండ్ వైరస్ వల్లే తాను కుమారుడికి దూరం అయ్యానని చెప్పారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
Elon Musk : టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ తన కుమారుడు లింగ మార్పిడి చేయించుకోవడంపై తాజాగా స్పందించారు. ఓక్ మైండ్ వైరస్(woke mind virus) వల్లే తన కొడుకు తనకు దూరం అయ్యాడంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలపై లింగ మార్పిడి ప్రక్రియలు చేయడాన్ని సైతం ఆయన తీవ్రంగా ఖండించారు. తనను మభ్య పెట్టి తన కుమారుడి లింగ మార్పిడికి తనతో సంతకం చేయించుకున్నారని అన్నారు. కోవిడ్ సమయంలో తన మైండ్ అంతా గందరగోళంగా ఉండేదన్నారు. ఆ తరుణంలో లింగ మార్పిడి చేయకపోతే తన కొడుకు ఆత్మహత్య చేసుకునే ప్రమాదం ఉందని తనను భయపెట్టి సంతకం చేయించుకున్నారని అన్నారు. ఇదంతా ఆయన ఎందుకు మాట్లాడారో తెలియాలంటే ఆయన గతం గురించి తెలియాల్సిందే.
మస్క్ తన మాజీ భార్య జస్టిస్ విల్సన్‌తో 2008లో డివోర్స్ తీసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. వారి పేర్లు జేవియర్ అలెగ్జాండర్, గ్రిఫ్ఫిన్. వీరిలో అలెగ్జాండర్ కొంత కాలం కిందట కోవిడ్ సమయలో లింగ మార్పిడి చేయించుకున్నాడు. అమ్మాయిగా మారాడు. తన తండ్రితో తాను కలిసి జీవించకపోవడం వల్ల ఆయన పోలికలతో సంబంధం లేకుండా మారిపోవాలని తాను కోరుకున్నాడు. దీంతో అమ్మాయిగా మారిపోయి జెనా విల్సన్‌గా పేరు మార్చుకున్నాడు.
ఈ నేపథ్యంలో ఓక్ మైండ్ వైరస్ వల్లే తాను కుమారుడిని కోల్పోయానని ఎలాన్ మస్క్(Elon Musk) అంటున్నారు. సామాజిక సమస్యలకు ఎక్కువగా ఆకర్షితులు కావడం, వాటికి అతిగా స్పందించడం లాంటి లక్షణాలను సాధారణంగా ఓక్ మైండ్ వైరస్ అనే పదాన్ని ఉపయోగిస్తుంటారు. వీటి వల్లనే తాను తన కొడుకుని కోల్పోయానని మస్క్ ఆవేదన వ్యక్తం చేశారు. లింగమార్పిడి హక్కుల్ని పరిమితం చేసే చట్టాలకి అమెరికాలో రిపబ్లికన్ పార్టీ మద్దతిస్తోంది. దీంతో ఆయన ఆ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు గతంలో ప్రకటించారు. అలాగే ట్రాన్స్జెండర్లకు తన పూర్తి మద్దతు ఉంటుందని గతంలో ఆయన ఎక్స్‌లో ట్వీట్ చేశారు.