»Elon Musk Donates To Group Working To Elect Donald Trump
Elon Musk : ట్రంప్‌కి భారీ విరాళం ఇచ్చిన ఎలాన్ మస్క్
ట్రంప్ ఎన్నికల్లో గెలిచేందుకు కృషి చేస్తున్న ఓ సంస్థకు ప్రపంచ సంపన్నుల్లో ఒకరైన ఎలాన్ మస్క్ భారీ విరాళాన్ని అందించారు. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇక్కడ చదివేయండి.
Elon Musk Donation : అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం అభ్యర్థిగా పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్‌కు(Donald Trump)
ఎలాన్ మస్క్ సపోర్ట్ చేస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. తాజాగా డొనాల్డ్ ట్రంప్ విజయం కోసం కృషి చేస్తూ ప్రచారం చేస్తున్న అమెరికా ప్యాక్ అనే సంస్థకు ఎలాన్ మస్క్(Elon Musk) భారీ విరాళం అందించారు. అయితే ఎంత మొత్తం ఇచ్చారన్న విషయంలో మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. పెద్ద మొత్తంలోనే సహాయం చేశారని మాత్రం బ్లూమ్ బర్గ్ వెల్లడించింది.
గతంలో ఎలాన్ మస్క్(Elon Musk) తాను రాజకీయాలకు దూరంగా ఉండాలని అనుకుంటున్నట్లు ప్రకటించారు. ఎవరినీ సపోర్ట్ చేసిన దాఖలాలు లేవు. అయితే తాజా పరిణామాలతో అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో ఆయన ట్రంప్‌నే సపోర్ట్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఆయన ఎంత ఇచ్చారన్న విషయం సైతం తొందరలోనే తెలిసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అమెరికా ప్యాక్ సంస్థ తమ డోనర్ల వివరాలను తొందరలోనే వెల్లడించనున్నట్లు ప్రకటించింది.
రిపబ్లికన్ పార్టీలో ట్రంప్ అభ్యర్థిత్వం దాదాపుగా ఖరారు అవుతున్నట్లే ఉంది. ఇటీవల కొన్ని కేసుల్లో ఆయన దోషిగా తీర్పు రావడం, భారీగా జరిమానాలు వంటివి ఈ సమయంలో ఆయనకు కాస్త ఇబ్బంది కలిగిస్తున్నాయి. అయినప్పటికీ ట్రంప్ మాత్రం దూకుడును ఏ మాత్రమూ తగ్గించడం లేదు. డెమాక్రటిక్ పార్టీ తరఫున జో బైడెన్(Elon Musk) మరోసారి అభ్యర్థిగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది నవంబర్‌లో అగ్ర రాజ్యంలో ఎన్నికలు(us election 2024) జరగనున్నాయి.