»Trump After Biden Quits Presidential Race Kamala Harris Will Be Easier To Defeat
Us Elections : బైడెన్ చెత్త అధ్యక్షడు, హారిస్‌ని మరింత తేలిగ్గా ఓడించేస్తా : ట్రంప్
జో బైడెన్ అత్యంత చెత్త అధ్యక్షుడని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. వచ్చే నవంబర్‌లో జరగబోయే ఎన్నికలకు జో బైడెన్ బరి నుంచి తప్పుకొన్నారు. అయితే తాను కలమలాహారిస్ని మరింత దీటుగా ఓడిస్తానని ట్రంప్ చెప్పుకొచ్చారు. ఈ విషయమై ఆయన ఇంకా ఏమన్నారంటే?
Us Elections 2024 : అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా డెమాక్రాటిక్ పార్టీ తరఫున ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ బరి నుంచి తప్పకున్నారు. దీంతో ఈ విషయమై మాజీ అమెరికా అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ ప్రస్తుత అభ్యర్థి అయిన డొనాల్డ్ ట్రంప్(donald Trump) స్పందించారు. జో బైడెన్ అమెరికా చరిత్రలో అత్యంత చెత్త అధ్యక్షుడని విమర్శించారు. ఇప్పుడు అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా డెమాక్రాటిక్ పార్టీ తరఫున కమలాహారిస్ పేరు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఆమెను ఓడించడం మరింత సులభం అని ట్రంప్ చెప్పుకొచ్చారు.
అమెరికా అధ్యక్ష హోదాలో పని చేసే అర్హత జో బైడెన్‌కు లేదని ట్రంప్(Trump) దుయ్యబట్టారు. కేవలం అబద్ధాలు, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే ఆయన ఆ పదివిలో ఉన్నారని విమర్శించారు. ఇప్పుడున్న మీడియాకి, వైద్యులికి, చుట్టు ఉన్న వారు అందరికీ ఆయన ఈ పదవికి అర్హడు కాదనే విషయం తెలుసునని అన్నారు. ఇంకా ఆయనే పాలనలో ఉంటే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పారు. అందుకనే వీలైనంత వరకు వాటిని త్వరగా చక్కబెట్టేద్దాం అంటూ ట్రంప్ అమెరికా ప్రజలకు పిలుపునిచ్చారు.
మరోవైపు బైడెన్(Biden) తర్వాత డెమాక్రాట్ల అభ్యర్థిగా వినిపిస్తున్న పేరు కమలాహారిస్(Kamala Harris). జోబైడెన్, బిల్ క్లింటర్, ఆయన సతీమణి, భారత సంతతి ప్రతినిధులు మద్దతు పలుకున్నారు. అయితే ఒబామా వర్గం నుంచి మాత్రం ఆమెకు ఇంకా మద్దతు రాలేదు. మొత్తం 4,700 మంది పార్టీ ప్రతినిధులు ఆమె అభ్యర్థిత్వాన్ని ఆమోదించాల్సి ఉంటుంది. ఆగస్టులో జరిగే పార్టీ సదస్సులో అధికారికంగా అభ్యర్థిని వారు వెల్లడిస్తారు. అప్పటి వరకు కమలాహారిస్ అభ్యర్థిత్వం సస్పెన్స్‌లో ఉన్నట్లే.