డెమోక్రటిక్ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు అయిన జో బైడెన్ అమెరికా అధ్యక్ష రేసు నుంచి వైదొలగారు. అతని అభ్యర్థిత్వంపై సొంత పార్టీ నుంచే తీవ్ర వ్యతిరేకత రావడంతో అతనే తొలగుతున్నట్లు తెలిపారు.
Joe Biden: డెమోక్రటిక్ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు అయిన జో బైడెన్ అమెరికా అధ్యక్ష రేసు నుంచి వైదొలగారు. అతని అభ్యర్థిత్వంపై సొంత పార్టీ నుంచే తీవ్ర వ్యతిరేకత రావడంతో అతనే తొలగుతున్నట్లు తెలిపారు. పార్టీ, దేశ ప్రయోజనాల దృష్ట్యా బైడెన్ పోటీ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు పార్టీ కార్యకర్తలకు, దేశ ప్రజలకు లేఖ రాశారు. ఎన్నికలకు ఇంకా 4 నెలలే మిగిలి ఉన్న సమయంలో బైడెన్ పోటీ నుంచి తప్పుకోవడంతో పార్టీలో అమోమయం నెలకొంది. బరిలో ఎవరు నిలుస్తారన్న దానిపై ఉత్కంఠ ఉంది.
ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ ఆమె అభ్యర్థిత్వానికి మద్దతు పలికారు. వచ్చే నెల 19 నుంచి 22 మధ్య షికాగోలో జరిగే సమావేశంలో అభ్యర్థిని ఎన్నుకుంటారు. రెండోసారి ఎన్నికల్లో విజయం సాధించాలని ఉన్నా తప్పని పరిస్థితుల్లో పార్టీ నుంచి వీడుతున్నట్లు తెలిపారు. ఇటీవల ప్రచార సభల్లో బైడెన్ తడబడ్డారు. అలాగే ట్రంప్‌తో పాటు జరిగిన చర్చలో ఘోరంగా విఫలమయ్యారు. అభ్యర్థి ఇలా సడెన్‌గా వైదొలిగితే ఏం చేయాలన్న విషయంపై క్లారిటీ లేదు. కొన్ని రోజుల్లో దీనిపై స్పష్టత ఇచ్చే అవకాశముంది.