GNTR: విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సమస్యల పరిష్కారానికి ప్రతి నెల నాలుగో శనివారం కలెక్టర్ కార్యాలయంలో స్పెషల్ గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లు అధికారులు ఒక ప్రకటన ద్వారా తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధి కల్పన అధికారి, విభిన్న ప్రతిభావంతుల శాఖ సహాయ సంచాలకుడు దుర్గాభాయ్ పలు సమస్యలపై చర్చించనున్నట్లు పేర్కొన్నారు. అర్హులు హాజరై సమస్యలు తెలపాలని సూచించారు.