ASR: మావోయిస్టులు ల్యాండ్మైన్లు అమర్చారన్న సమాచారంతో మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. నవంబరు 18, 19 ఎన్కౌంటర్ల నేపథ్యంలో అడవిలో ముమ్మరంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. భద్రతా దృష్ట్యా పర్యాటకులు అడవి లోతట్టు ప్రాంతాలకు వెళ్లవద్దని, కేవలం ప్రధాన పర్యాటక ప్రాంతాలకే పరిమితం కావాలని రంపచోడవరం డీఎస్పీ సాయి ప్రశాంత్ సూచించారు.