MBNR: జిల్లాలో కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. MP డీకే అరుణ పార్లమెంటులో చేసిన విజ్ఞప్తి మేరకు మక్తల్, కొడంగల్, గద్వాల ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం కేంద్ర ప్రతినిధుల బృందం, రాష్ట్ర ఉన్నతాధికారులు గద్వాలలో పర్యటించి పాఠశాల నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని పరిశీలించి ఖరారు చేశారు.