PDPL: మంథని రూరల్ మండలంలోని ఖాన్ సాయిపేట సమీపంలోని గోదావరినదిలో ఎల్ మడుగు వద్ద శుక్రవారం సాయంత్రం పెద్దపులి పాదముద్రలను కనుగొన్నట్లు ఎక్లాస్ పూర్ SO అబ్జల్అలీ తెలిపారు. పాదముద్రలు ఆధారంగా పెద్దపులి గోదావరినదిలో ఆరెంద వైపు వెళ్లినట్లు గుర్తించామన్నారు. రాత్రి కావడంతో ఆ ప్రాంతంవైపు తాము వెళ్లలేదన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.