MBNR: మాదాపూర్లోని ఓ కళాశాలలో ఇంటర్ విద్యార్థి గుండెపోటుతో మృతి చెందాడు. జడ్చర్ల పట్టణంలోని కావేరిమ్మపేటకు చెందిన మాజీ వార్డు సభ్యుడు సుధా, కాశీవిశ్వనాథ్ దంపతుల పెద్దకుమారుడు ధనుష్(17) ఇంటర్ ద్వితీయసంవత్సరం చదువుతున్నాడు. శుక్రవారం అనుకోకుండా గుండెపోటు రావడంతో విద్యార్థి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.