AP: తనను చంపేందుకు కుట్ర జరుగుతోందని వైసీపీ మాజీ నేత దువ్వాడ శ్రీనివాస్ ఆరోపించారు. వైసీపీ నేత ధర్మాన కృష్ణదాస్‌పై అనుమానం వ్యక్తం చేశారు. తన హత్యకు కుట్ర గురించి కింజరాపు అప్పన్న అనే వ్యక్తి మాధురికి ఫోన్ చేసి చెప్పాడని అన్నారు. నరసన్నపేట లేదా నిమ్మాడ దగ్గర హత్యకు ప్లాన్ చేశారని పేర్కొన్నారు. నిమ్మాడ దగ్గర నేషనల్ హైవేపై నిలబడి ప్రత్యర్థులకు దువ్వాడ సవాల్ విసిరారు.