మరో 4 రోజుల్లో 2025 ముగుస్తుంది. అయితే, జనాలను ఈ ఏడాది షాక్‌కు గురి చేసిన ముఖ్యమైన అంశం బంగారం, వెండి ధరలేనని చెప్పాలి. ఈ సంవత్సరం 2 లోహాలూ ఆల్ టైమ్ గరిష్ఠాలను నమోదు చేశాయి. ఇక భారత్‌లో డిజిటల్ గోల్డ్‌కు డిమాండ్ పెరగడం మరో ఆసక్తికర పరిణామం. డిజిటల్ గోల్డ్‌పై ఈ ఏడాది పెట్టుబడి పెట్టిన వారిలో 50 శాతం మంది జెన్ జీ, మిలీనియల్స్ తరాల వారే కావడం గమనార్హం.