ATP: రాయదుర్గం పట్టణంలోని 9వ వార్డులో నూతన సీసీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు భూమిపూజ చేశారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందించడమే లక్ష్యంగా ప్రతి వార్డులో రహదారుల నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. రోడ్డు పనుల్లో నాణ్యత పాటిస్తూ త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.