కృష్ణా: కానూరు గ్రామంలో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని రహదారులు, డ్రైనేజీ వ్యవస్థల పరిస్థితిని ఎమ్మెల్యే పరిశీలించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని, రహదారుల మరమ్మత్తులు, డ్రైనేజీ శుభ్రత, నీటి నిల్వలు తొలగింపు వంటి అంశాలపై సంబంధిత అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.