NZB: ‘టీబీ ముక్త్ భారత్ అభియాన్’లో భాగంగా నవీపేట్ మండలం కోస్లీ గ్రామంలో ‘సముక్త్ భారత్ అభియాన్’ కార్యక్రమం నిర్వహించారు. 100 మందికి రక్త పరీక్షలు, ఛాతీ ఎక్స్రేలు, కళ్ల పరీక్షలు నిర్వహించి నమూనాలను సేకరించారు. పల్లె దవాఖానా వైద్యుడు డాక్టరు జీ.ప్రవీణ్ మాట్లాడుతూ.. క్షయ వ్యాధిని ముందస్తుగా గుర్తించి చికిత్స పొందితే పూర్తిగా నయం చేసుకోవచ్చని సూచించారు.