BPT: విద్యుత్ తీగలు తగిలి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన వేమూరులో శనివారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. అట్లూరి సునీల్ (22) ట్రాక్టర్‌పై పిండి కట్టలు తీసుకుని బేతేలుపురం పొలాలకు వెళ్లాడు. కాగా ట్రాక్టర్ నుంచి పిండి కట్టలు దింపుతుండగా వేలాడుతున్న విద్యుత్ తీగలు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడన్నారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.