కృష్ణా: బంటుమిల్లి మండలం చొరంపూడి ప్రభుత్వ పాఠశాలలోని 236 మంది విద్యార్థులకు నిత్యం నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందిస్తున్నట్లు ప్రధానోపాధ్యాయులు మల్లికార్జునరావు తెలిపారు. ప్రతిరోజూ ఆహార నాణ్యతను తనిఖీ చేయడంతో పాటు, విద్యార్థుల ఆరోగ్యం కోసం ప్రత్యేకంగా మినరల్ వాటర్ సౌకర్యం కల్పించామన్నారు. ప్రభుత్వ మెనూతో పాటు విద్యార్థులకు అదనంగా మరో పోషకాహార పదార్థాన్ని కూడా అందజేస్తామని పేర్కొన్నారు.