SKLM: మందస మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో మహిళా సంఘ సభ్యులతో వెలుగు పీవో పైడి కూర్మా రావు ఆధ్వర్యంలో ఇవాళ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం శ్రీనిధి బ్యాంకు ద్వారా కేవలం 92 పైసలు వడ్డీకే సంఘానికి సుమారు రూ.8 లక్షల వరకు అతి తక్కువ వడ్డీకి ఎలాంటి ప్రాసెస్ చార్జీ లేకుండా అందిస్తున్న దానిని సద్వినియోగపరుచుకోవాలని తెలిపారు.