సూర్యాపేటలో మూడు రోజులుగా సాగుతున్న గోవింద స్వాముల మండల పూజలు ఇవాళ సుదర్శన హోమంతో వైభవంగా ముగిశాయి. ప్రధాన అర్చకులు నల్లాన్ చక్రవర్తుల వేణుగోపాలచార్యుల ఆధ్వర్యంలో పూర్ణాహుతి నిర్వహించి, భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. అనంతరం స్వాములు ఇరుముడి కట్టుకుని తిరుమల బయలుదేరారు. ముక్కోటి ఏకాదశి నాడు శ్రీవారి దర్శనంతో దీక్ష విరమిస్తారని అన్నారు.