మెదక్ అయ్యప్ప దేవాలయంలో మండల మహా పడిపూజ శనివారం కనులపండువగా జరిగింది. గురుస్వామి హరిదాస్, అర్చకులు వైద్య రాజు పంతులు ఆధ్వర్యంలో స్వామివారికి పంచామృత అభిషేకాలు, విశేష అలంకరణ, మహామంగళహారతి నిర్వహించారు. ఈ వేడుకలో మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి, నాయకులు తిరుపతి రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. భజన మండలి సంకీర్తనలు భక్తులను అలరించాయి.