SRPT: నూతన సర్పంచులు గ్రామాభివృద్దే లక్ష్యంగా ముందుకు సాగాలని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు అన్నారు. ఇటీవల జరిగిన మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన జాజిరెడ్డిగూడెం మండలం సూర్యనాయక్ తండా సర్పంచ్ లూనావత్ కృష్ణనాయక్ ఇవాళ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సామేలును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారిని శాలువాతో సన్మానించారు.