JGL: కేరళలోని శబరిమలలో చేపట్టే మండల పూజలో భాగంగా కోరుట్ల పట్టణంలోని శ్రీ అయ్యప్ప స్వామి, జ్ఞానసరస్వతి మాత, శనైశ్చర దేవాలయంలో అయ్యప్పస్వామి జాతర మహోత్సవాన్న అంగరంగ వైభవంగా శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు అలయాల్లోని మూలవిరట్లకు అభిషేకార్చనలు, ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఆవరణలో గణపతి, సుబ్రహ్మణ్య, అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు చేశారు.