MBNR: ఒకరి నేత్రదానం ఇద్దరి జీవితాలలో వెలుగును నింపుతుందని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మహబూబ్ నగర్ జిల్లా ఛైర్మన్ లయన్ నటరాజు అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని మయూరి నర్సిరెడ్డి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నవాబుపేట మండలం లోకరేవుకు చెందిన గంగాధర్ గౌడ్ మరణించారు. అతని కంటి కార్నియాను ఎల్ వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ వారు సేకరించారు.