PDPL: పెద్దపల్లి జిల్లా రామగిరి ఖిల్లాను రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయనుంది. ఒకప్పుడు మావోయిస్టుల ప్రభావంతో ఉన్న ఈ ప్రాంతం ఇక టూరిస్ట్ స్పాట్‌గా మారబోతోంది. అటవీ శాఖకు రూ.1.14 కోట్లు, టూరిజం శాఖకు రూ.3.86 కోట్లు కేటాయించి పర్వతమాల ప్రాజెక్ట్ కింద రోప్ వే ఏర్పాటు చేయనున్నారు. దీంతో పరిసర గ్రామాలకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.