MBNR: ప్రజల ఆకాంక్షల మేరకు సర్పంచులు నడుచుకోవాలని జడ్చర్ల మాజీ శాసనసభ్యులు డాక్టర్ చర్లకోల లక్ష్మారెడ్డి అన్నారు. శనివారం నవాబుపేట మండలం రుద్రారం గ్రామ సర్పంచ్‌గా కావాలి రవీందర్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజలకు ఏ సమస్య వచ్చినా కూడా వెంటనే స్పందించి వారి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.