టాలీవుడ్ హీరో ఆది సాయికుమార్ నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘శంబాల’ థియేటర్లలో సందడి చేస్తోంది. తాజాగా ఈ చిత్రం రెండు రోజుల కలెక్షన్స్ను మేకర్స్ ప్రకటించారు. వరల్డ్ వైడ్గా ఈ చిత్రం రెండు రోజుల్లో రూ. 5.4 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు వెల్లడించారు. ఇక యుగంధర్ ముని తెరకెక్కించిన ఈ సినిమాలో అర్చనా అయ్యర్, శ్వాసిక విజయ్, రవి వర్మ కీలక పాత్రలు పోషించారు.