AP: విజయవాడ దుర్గగుడికి విద్యుత్ సరఫరా నిలిపివేతపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పందించారు. రూ.3.08 కోట్ల బిల్లు బకాయిలు ఉండటంతో APCPDCL అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు. అయితే, భక్తుల మనోభావాలను పరిగణలోకి తీసుకోవాలని దేవస్థానం కోరింది. ఈ నేపథ్యంలో మంత్రి మాట్లాడుతూ.. తక్షణమే జనరేటర్ల ద్వారా ప్రత్యామ్నాయ విద్యుత్ సేవలు అందించాలని ఆదేశించారు.