HYD: లంగర్‌హౌస్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ప్రధాన రహదారి పక్కనే కంటైనర్‌లో వైన్‌షాప్ నిర్వహించడం చర్చకు దారి తీసింది. గోల్కొండ ఎక్సైజ్ పరిధిలో మంజూరైన వైన్‌షాప్ భవనం సిద్ధం కాకపోవడంతో, దుకాణదారుడు రోడ్డు పక్కనే కంటైనర్ ఏర్పాటు చేసి మద్యం విక్రయాలు ప్రారంభించాడు. ప్రధాన రహదారిపై ఈ తరహా ఏర్పాటు స్థానికులు, ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.