NLR: బుచ్చిరెడ్డిపాళెంలో శనివారం స్వచ్ఛ ఆంధ్ర–స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక బస్ స్టేషన్లో పారిశుద్ధ్య కార్మికులు, ఆర్టీసీ కార్మికులకు ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి దుప్పట్లు, స్వెట్టర్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డీపీటీఓ, సిటీమ్, డిపో మేనేజర్లు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. స్థానిక బస్టాండ్‌కు అన్ని బస్సులు వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు.