KMM: ఏదులాపురం మున్సిపాలిటీ వరంగల్-X రోడ్ నందు ఇంటిగ్రేటెడ్ ఖమ్మం రూరల్ మండల ప్రభుత్వ కార్యాలయాల భవన నిర్మాణ పనులకు శనివారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జిల్లా కలెక్టర్ అనుదీప్ తో కలిసి శంకుస్థాపన చేశారు. మండల ప్రభుత్వ కార్యాలయాలను ఒక చోట నిర్మించి ప్రజలకు మెరుగైన ప్రభుత్వ సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందని పేర్కొన్నారు.