KDP: కమలాపురానికి చెందిన విశ్రాంత బ్రాంచ్ పోస్ట్మాస్టర్ అగడూరు భార్గవయ్య (78) శుక్రవారం సాయంత్రం మృతి చెందారు. విధుల్లో ఉన్నప్పుడు గ్రామస్థులతో ఆప్యాయంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించిన ఆయనకు మంచి పేరుంది. ఆయన స్నేహపూర్వకత, వినయశీల స్వభావం గ్రామస్థుల హృదయాల్లో నిలిచిపోయాయి. ఈ వార్తతో గ్రామస్థులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.