నారాయణపేట జిల్లా నర్వ మండలం ఉందెకోడ్ గ్రామానికి చెందిన శారద ఈ నెల 4వ తేదీ నుండి కనిపించకుండా పోయింది. ఆమె భర్త చెన్నప్ప బంధువుల ఇళ్లతో పాటు పలుచోట్ల వెతికినప్పటికీ ఆచూకీ లభించలేదు. దీంతో, చెన్నప్ప నర్వ పోలీస్ స్టేషన్లో శనివారం ఫిర్యాదు చేయగా, పోలీసులు వివరాలు అడిగి తెలుసుకుని ఫిర్యాదు అందుకున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై విచారణ ప్రారంభమైంది.