TG: ఉపాధి హామీ పథకం పేరు మార్పు చేసినందుకు అన్ని గ్రామాల్లో రేపు నిరసన చేపట్టాలని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ పిలుపునిచ్చారు. నిరసన కార్యక్రమాలను కార్యకర్తలు విజయవంతం చేయాలని సూచించారు. ఇప్పటికే జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. ఉపాధి హామీ పథకాన్ని నీరు గార్చేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తుందన్నారు.