KDP: సీఎం రిలీఫ్ ఫండ్ నిధులు పేదలకు సంజీవిని లాంటిదని టీడీపీ వేంపల్లె మండల ఉపాధ్యక్షుడు పసుపులేటి వీరభద్ర అన్నారు. శనివారం ఆ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ బిటెక్ రవి చేతుల మీదుగా లబ్ధిదారునికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేశారు. పేదల ఆరోగ్య శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం కింద నిధులు మంజూరు చేస్తోందన్నారు.