AP: జిల్లాల పునర్విభజనలో అధికారులు స్వల్ప మార్పులు చేశారు. గూడూరును నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలని నిర్ణయించారు. నక్కపల్లి డివిజన్ బదులుగా అడ్డరోడ్డు జంక్షన్‌ను కేంద్రంగా మార్చారు. మార్కాపురం జిల్లా పరిధిలోకి దొనకొండ, కురిచేడు మండలాలను చేరుస్తూ నిర్ణయం తీసుకున్నారు. కాగా, ఈనెల 31న తుది నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే.