BDK: పాల్వంచలోని కేటీపీఎస్ కాలనీలో మహావృక్షాలు నేలకూలుతున్నాయి. ఐదు దశాబ్దాల క్రితం కేటీపీఎస్ ఏ, ఇంటర్మీడియట్ కాలనీ ప్రాంతాల్లో నాటిన మొక్కలు ఇప్పుడు మహా వృక్షాలుగా మారాయి. ఈ క్రమంలో కొత్త క్వార్టర్ల నిర్మాణానికి జెన్కోశ్రీకారం చుట్టగా అధికారులు మహావృక్షాలను యంత్రాల సహాయంతో శనివారం నేలకూలుస్తున్నారు. ఇప్పటికే 100 మహా వృక్షాలను తొలగించినట్లు సమాచారం.