TG: HYD కలెక్టరేట్ ఎదుట ధర్నా చేసిన జర్నలిస్టులను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే వారి అరెస్టును మాజీ మంత్రి KTR ఖండించారు. జర్నలిస్టులను నిర్భంధించడం కాంగ్రెస్ నిరంకుశత్వానికి నిదర్శనమని మండిపడ్డారు. ప్రజాస్వామ్య పరిరక్షణ అంటూ కాంగ్రెస్ ఇచ్చిన ఏడో గ్యారంటీ ఇదేనా? అని నిలదీశారు. జర్నలిస్టుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇచ్చిన GO రద్దు చేయాలన్నారు.