MDK: న్యూ ఇయర్ వేడుకలు ప్రజలు ప్రశాంతంగా, నిబంధనలకు లోబడి జరుపుకోవాలని ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. డిసెంబర్ 31 రాత్రి 8 గంటల నుంచే జిల్లావ్యాప్తంగా పోలీసుల పహారా మొదలవుతుందని, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలతో పెట్రోలింగ్ నిర్వహిస్తామన్నారు. ‘డ్రంక్ అండ్ డ్రైవ్’ తనిఖీలు ముమ్మరం చేస్తామని, వేడుకల పేరిట హద్దులు దాటొద్దన్నారు.