MBNR: అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ ఆధ్వర్యంలో జరిగే సౌత్ జోన్ మహిళల క్రికెట్ పోటీలకు పాలమూరు యూనివర్సిటీ మహిళల జట్టు ఎంపికలు ఈనెల 29 నిర్వహించనున్నట్లు ఫిజికల్ డైరెక్టర్ డా. వై. శ్రీనివాసులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పోటీలలో పాల్గొనే క్రీడాకారిణులు బోనాఫైడ్ సర్టిఫికెట్, ఆధార్ కార్డుతో పాటు వారి వయస్సు 17–25 సంవత్సరాల మధ్య ఉండాలన్నారు.