HYD: కూకట్పల్లి కైత్లాపూర్ గ్రౌండ్స్‌లో ఇవాళ సాయంత్రం ప్రభాస్ సినిమా ‘రాజా సాబ్’ వేడుక జరుగనుంది. భారీ సంఖ్యలో అభిమానులు వచ్చే అవకాశం ఉండడంతో సైబరాబాద్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు ప్రకటించారు. కూకట్పల్లి, హైటెక్ సిటీ మార్గాల్లో ప్రయాణించే వ్యక్తులు అప్రమత్తంగా ఉండవలసిందిగా, ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించమని అధికారులు సూచించారు.