SRPT: ప్రైవేట్ ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యంతోనే తమ బాబు మృతి చెందాడని ఆత్మకూరు (ఎస్) మండలం గట్టికల్ గ్రామానికి చెందిన కారే మహేష్ ఆరోపించారు. పుట్టిన బాబును పిల్లల ఆస్పత్రికి తరలించగా, ఏమైనా సమస్య ఉందా అని అడిగితే మంచి వైద్యం అందిస్తానీ చెప్పి చివరకు ప్రాణం తీశారని వాపోయారు. వైద్యుల వైఫల్యం వల్లే తమకు పుత్రశోకం మిగిలిందని కన్నీరుమున్నీరయ్యారు.