KRNL: వైసీపీ పార్టీ వీరాభిమాని దిబ్బనదొడ్డి కురువ వీరేశ్ మృతి పట్ల కర్నూలు జిల్లా ఉపాధ్యక్షులు వై. ప్రదీప్ రెడ్డి సంతాపం తెలిపారు. ఇవాళ విషయం తెలుసుకున్న వెంటనే ఆయన వీరేశ్ మృతదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం కుటుంబ సభ్యులకు రూ.25 వేల ఆర్థిక సహాయం అందజేశారు. రాంపురం రెడ్డి సోదరుల కుటుంబం అండగా ఉంటుందని తెలిపారు.